Champions Trophy : భారత్, పాక్ పోరు టికెట్లు సేల్.. ధర ఎంతంటే?

by Harish |

చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడబోయే మ్యాచ్‌ల టికెట్లను ఐసీసీ సోమవారం రిలీజ్ చేసింది.

Champions Trophy : భారత్, పాక్ పోరు టికెట్లు సేల్.. ధర ఎంతంటే?
X

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడబోయే మ్యాచ్‌ల టికెట్లను ఐసీసీ సోమవారం రిలీజ్ చేసింది. మెగా టోర్నీలో టీమిండియా మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 20న భారత్ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న భారత్, పాక్ పోరు ఈ నెల 23న జరగనుంది. ఇక, చివరి గ్రూపు మ్యాచ్‌లో మార్చి 2న న్యూజిలాండ్‌ను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను ఐసీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, జనరల్ స్టాండ్ టికెట్లు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. టికెట్ల ధర దాదాపు రూ.3 వేల నుంచి మొదలుకానుంది. ప్రీమియర్, వీఐపీ స్టాండ్ల టికెట్స్‌ను రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే, భారత్, పాక్ మ్యాచ్ టికెట్లకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది. కాబట్టి, ఆ మ్యాచ్ టికెట్లు త్వరగానే అమ్ముడుపోవడం ఖాయమే. మరోవైపు, తొలి సెమీస్ తర్వాత ఫైనల్ టికెట్లను రిలీజ్ చేయనున్నారు. చాంపియన్స్ ట్రోఫీ వెబ్‌సైట్‌‌‌లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు.


Next Story