- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేనేమన్నా సెలెక్టర్‌నా? అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడంపై గంభీర్
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయలేదు. దీనిపై ప్రశ్నలను తప్పించుకునేందుకు గంభీర్ ప్రయత్నించాడు.

దిశ, స్పోర్ట్స్: ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లే భారత జట్టులో స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. దేశవాళీలు, ఐపీఎల్‌లో రాణించినా కూడా అయ్యర్‌ను ఇంగ్లండ్ టెస్టులకు ఎంపిక చేయలేదు. కానీ సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ వంటి వారిని ఎంపిక చేశారు. ఇది అయ్యర్‌కు జరిగిన అన్యాయమని పలువురు మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌లో అదరగొట్టడంతోపాటు దేశవాళీల్లో కూడా అయ్యర్ అద్భుతంగా రాణించాడు. కానీ అలాంటి ప్లేయర్‌ను ఇంగ్లండ్‌కు పంపకుండా, సాయి సుదర్శన్ వంటి కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వడమేంటని పలువురు నిలదీస్తున్నారు. ఇదేం నిర్ణయం? అయ్యర్ వంటి ప్లేయర్‌ను ఎలా వదిలేశారు? అని గంభీర్‌ను అడగ్గా.. ‘నేను సెలెక్టర్‌ను కాదు’ అని సింపుల్‌గా సమాధానం చెప్పాడు. ఈ విషయంపై ఇంకా ప్రశ్నలు ఎదుర్కోకుండా వెళ్లిపోయాడు.
జట్టు ఎంపికలో తన పాత్ర చాలా పరిమితంగా ఉంటుందని గతంలో కూడా గంభీర్ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, ఇంగ్లండ్‌తో భారత్ టెస్టు సిరీస్ జూన్ 20న మొదలవుతుందన్న సంగతి తెలిసిందే. తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ వేదికగా జరుగుతుంది. రెండో టెస్టు ఎడ్జ్‌బాస్టన్‌లో జులై 2 నుంచి 6 వరకు, మూడో టెస్టు లార్డ్స్‌లో జులై 10 నుంచి 14 వరకు, నాలుగో టెస్టు ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జులై 23 నుంచి 27 వరకు, ఇక చివరి టెస్టు ఓవల్‌లో జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు జరగనున్నాయి.






