- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
23 ఏళ్ల పిల్లాడిని టార్గెట్ చేస్తున్నారు..కోపంతో ఊగిపోయిన గంభీర్
హర్షిత్ రాణాపై దారుణంగా ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై గంభీర్ తొలిసారిగా రియాక్ట్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియా టూర్ కు సెలెక్ట్ అయిన హర్షిత్ రాణాపై దారుణంగా ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ తొలిసారిగా రియాక్ట్ అయ్యారు. అనవసరంగా 23 ఏళ్ల చిన్నపిల్లాడిని కొంతమంది కావాలనే, ట్రోలింగ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అలాంటి పిల్లలు మీకు కూడా ఉంటారని, మీ పిల్లలను కూడా ఇలా ట్రోలింగ్ చేస్తే ఊరుకుంటారా ? అని నిప్పులు జరిగారు గంభీర్. వెస్టిండీస్ పై సిరీస్ గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ లో గంభీర్ మాట్లాడారు. ఈ సందర్భంగా హర్షిత్ రాణాపై వస్తున్న ట్రోలింగ్స్ పై చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.
కొన్ని యూట్యూబ్ ఛానల్స్ డబ్బులు సంపాదించుకోవడం కోసం హర్షిత్ రాణాపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇది నిజంగా సిగ్గుచేటు అని ఆగ్రహించారు. కుర్రాడిలో సత్తా ఉంది కాబట్టి సెలెక్ట్ చేశామని క్లారిటీ ఇచ్చారు. ఇకపై హర్షిత్ రాణాపై ట్రోలింగ్ ఆపి, తనపై చేసుకోండి అని కౌంటర్ ఇచ్చారు. 2027 ప్రపంచ కప్ సమయానికి కోహ్లీ, రోహిత్ శర్మ ఆడతారా ? అన్నదాని పైన కూడా క్లారిటీ ఇచ్చారు గంభీర్. ఆ సమయం వరకు ఆ ఇద్దరు ప్లేయర్లు ఫిట్ గా ఉంటే కచ్చితంగా తుది జట్టులో ఉంటారని వివరించారు. కాగా హర్షిత్ రాణాను సెలక్ట్ చేయడంపై అశ్విన్, కృష్ణమాచారి శ్రీకాంత్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే.






