- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడిన భారత ఓపెనర్ అభిషేక్ శర్మ జింబాబ్వేపై హాఫ్ సెంచరీ బాది ఫామ్‌లోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌కు ముందు అతను 0, 0, 0, 15 రన్స్‌తో విఫలమవ్వగా.. అతన్ని జట్టు నుంచి తప్పించాలన్న డిమాండ్ వ్యక్తమైంది. కానీ, టీమ్ మేనేజ్‌మెంట్ అతనిపై నమ్మకం ఉంచి ఆడించగా.. జింబాబ్వేపై మెరుపులు మెరిపించి విమర్శకులకు సమాధానమిచ్చాడు. తన ఈ ఇన్నింగ్స్‌ను అభిషేక్ టీమ్ మొత్తానికి అంకితం చేశాడు. అతను మాట్లాడిన వీడియోను బీసీసీఐ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రపంచకప్‌లో ఆరంభ మ్యాచ్‌ల్లో విఫలమవడంపై స్పందిస్తూ.. ఈ సమయంలో హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్, సహచరులు తనకు మద్దతుగా నిలిచారని తెలిపాడు. మరో మ్యాచ్‌లో డకౌటైనా జట్టు నుంచి తప్పించమనే భరోసానిచ్చారని చెప్పాడు. ‘నేను ఆశించిన ఆరంభం దక్కలేదు. ప్రారంభంలో నా ఆరోగ్యం కూడా బాగాలేదు. హాస్పిటల్ పాలయ్యా. వరల్డ్ కప్‌లాంటి టోర్నీలో దేశం తరపున తొలి మ్యాచ్‌ను అత్యుత్తమంగా ప్రారంభించాలనుకున్నా.ఇన్ని రోజులు సహచరులు నాకు మద్దతుగా ఉన్నారు. ముఖ్యంగా కోచ్, కెప్టెన్. మరో సున్నా చేసినా ఏం పర్వాలేదన్నారు. నువ్వు అన్ని గేములు ఆడతావని, జట్టును గెలిపిస్తావని చెప్పారు. ఆటగాడికి ఇలాంటి సపోర్ట్ చాలా ముఖ్యం.’అని అభిషేక్ చెప్పుకొచ్చాడు. తిరిగి ఫామ్ అందుకోవడం చాలా రిలీఫ్‌గా ఉందన్నాడు. ‘నా కంటే నన్ను జట్టే నమ్మింది. అందుకే ఎమోషనల్ అయ్యా. ’అని చెప్పాడు.






