ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన గంభీర్.. ఎందుకో తెలుసా?

by Harish |

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన గంభీర్.. ఎందుకో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఏఐతో సృష్టించిన డీప్ ఫేక్స్ వీడియోల వల్ల తన గుర్తింపు దుర్వినియోగం అవుతుందని, వ్యక్తిగత, ప్రచార హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతూ దావా వేశాడు. ఫేస్ స్వాపింగ్, వాయిస్ క్లోనింగ్ వంటి ఏఐ టూల్స్ ఉపయోగించి తాను మాట్లాడినట్టు నకిలీ వీడియోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారని గంభీర్ పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటో ఉన్న పోస్టర్లతోపాటు ఇతర అనధికార వస్తువులను విక్రయించడాన్ని కూడా పిటిషన్‌లో ప్రస్తావించాడు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, టెలీ కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్‌లతోపాటు సోషల్ మీడియా అకౌంట్స్, ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌ సహా మొత్తం 16 పార్టీలపై దావా వేశాడు. డీప్ ఫేక్ కంటెంట్‌ను తక్షణమే తొలగించడమే కాకుండా నష్టపరిహారంగా రూ.2.5 కోట్లు ఇప్పించాలని కోరాడు. ‘తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, ఆదాయం ఆర్జించడానికి అనామక ఖాతాలు నా గుర్తింపు, నా పేరు, నా ముఖం, నా వాయిస్‌ను వాడుకుంటున్నాయి. ఇది కేవలం వ్యక్తిగత హననం మాత్రమే కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో చట్టం, గౌరవానికి సంబంధించిన అంశం. ప్రతి పబ్లిక్ ఫిగర్‌కు సంబంధించిన రక్షణ విషయం.’అని గంభీర్ పేర్కొన్నాడు.


Next Story