- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూరీ జగన్నాథుడి సేవలో గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్
టీ20 సిరీస్‌లో భాగంగా భారత్ (India), సౌతాఫ్రికా (South Africa) మధ్య తొలి పోరుకు కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికైంది.

దిశ, వెబ్‌డెస్క్: టీ20 సిరీస్‌లో భాగంగా భారత్ (India), సౌతాఫ్రికా (South Africa) మధ్య తొలి పోరుకు కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికైంది. ఈ నేపథ్యంలోనే ఇరు జట్లు ఆదివారం రాత్రి కటక్ సిటీకి చేరుకున్నాయి. అయితే, ఇవాళ ఉదయం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir)తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) దంపతులు, తిలక్ వర్మ (Tilak Varma)లు పూరీ జగన్నాథుడి ఆలయానికి వెళ్లారు. వారి వెంట ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (OCA) సీనియర్ అధికారులు, బీసీసీఐ సిబ్బంది కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అనంతరం గంభీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల దర్శనం చేసుకున్నారు. టీమిండియా ఆటగాళ్ల రాక సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పూరి ఎస్పీ, కలెక్టర్ స్వయంగా వారి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.






