న్యూజిలాండ్‌‌కు బిగ్ షాక్.. వన్డే వరల్డ్ కప్-2023కు కెప్టెన్ దూరం..!

by Vinod kumar |

న్యూజిలాండ్‌ జట్టుకు భారీ షాక్ తగలనుంది.

న్యూజిలాండ్‌‌కు బిగ్ షాక్.. వన్డే వరల్డ్ కప్-2023కు కెప్టెన్ దూరం..!
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌ జట్టుకు భారీ షాక్ తగిలే అవకాశం ఉన్నది. వన్డే వరల్డ్ కప్-2023కు న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. IPL 2023లో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కేన్‌ విలియమ్సన్‌ ఫీల్డింగ్‌ చేస్తుండగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో స్వదేశానికి వెళ్లి మేజర్‌ సర్జరీ చేయించుకోన్నాడు. అయితే అతడు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక వేళ ప్రపంచకప్‌ సమయానికి విలియమ్సన్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోతే.. కివీస్‌ జట్టను టిమ్‌ సౌథీ లేదా టామ్‌ లాథమ్‌ నడిపించే అవకాశం ఉన్నట్లు ఆ జట్టు హెడ్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్‌ తెలిపాడు.

Next Story