- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం పదవి ఇస్తే..? పొలిటికల్ ఎంట్రీపై గంగూలీ కీలక వ్యాఖ్యలు
సినిమా తారలు, క్రీడాకారులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం సాధారణమే. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో చాలా మంది రాజకీయాల్లో రానించారు.

దిశ, వెబ్ డెస్క్: సినిమా తారలు, క్రీడాకారులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం సాధారణమే. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో చాలా మంది రాజకీయాల్లో రానించారు. ఈ క్రమంలో సెలబ్రెటీలకు ఇంటర్వ్యూలలో పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. తాజాగా భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి సైతం అలాంటి ప్రశ్నలే ఎదురవ్వగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఏదైనా రాజకీయ పార్టీలో చేరుతారా అంటూ యాంకర్ ప్రశ్నించారు.
దానికి ఆయన ఆసక్తిలేదంటే సమాధానం ఇచ్చారు. ఒకవేళ సీఎం పదవి ఇస్తామని హామీ ఇస్తే ఒప్పుకుంటారా అనే మరో ప్రశ్నకు కూడా ఆసక్తిలేదు అంటూ సమాధానం ఇచ్చారు. అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకున్న తరవాత తాను విభిన్న పాత్రలను పోషించానని చెప్పారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, బీసీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టానని అన్నారు. కోచ్‌గా పనిచేందుకు సమయం దొరకలేదని చెప్పారు. ప్రస్తుతం తన వయసు 50ఏళ్లు మాత్రమే అని కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఏం జరుగుతుందో చూడాలని వ్యాఖ్యానించారు.






