కోహ్లీ, రోహిత్‌ల నుంచి క్రికెట్ ముందుకెళ్తోంది : గంగూలీ

by Harish |

టీమిండియా సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

కోహ్లీ, రోహిత్‌ల నుంచి క్రికెట్ ముందుకెళ్తోంది : గంగూలీ
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వారు ఇక వన్డేలు మాత్రమే ఆడనున్నారు. తాజాగా కోహ్లీ, రోహిత్ భవిష్యత్తుపై మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. వన్డేలలో కొనసాగడం వారికి అంత సులభం కాదన్నాడు. ఏడాదికి వారు 15 గేములే ఆడతారని, కాబట్టి ఫిట్‌నెస్ కాపాడుకోవడం చాలా కష్టమవుతుందని చెప్పాడు. ‘వారికి నేను ఎలాంటి సలహా ఇవ్వలేను. ఆట గురించి నాలాగే వాళ్లకు కూడా బాగా తెలుసు. వాళ్లు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ అందరం ఒక్కటి అర్థం చేసుకోవాలి. అందరిలాగే వారి నుంచి ఆట ముందుకు వెళ్తుంది. వారు కూడా ఆటకు దూరమవుతారు.’అని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ టూరుకు కోహ్లీ వెళ్లుంటే భారీగా పరుగులు చేసేవాడని గంగూలీ అభిప్రాయపడ్డాడు. కానీ, రిటైర్మెంట్‌కు ఇదే సమయమని అతను భావించాడని చెప్పాడు.


Next Story