ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ఆడు..హ‌ర్షిత్ రాణాకు క్లాస్ పీకిన గంభీర్‌

by velandi.Saikiran |

టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేలో సిరీస్నేపథ్యంలో హర్షిత్ రాణాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట గౌతమ్ గంభీర్.

ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ఆడు..హ‌ర్షిత్ రాణాకు క్లాస్ పీకిన గంభీర్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేల సిరీస్ జరిగిన నేపథ్యంలో హర్షిత్ రాణాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట గౌతమ్ గంభీర్. మొదటి రెండు వన్డేల్లో పెద్దగా నువ్వు రాణించలేదు.. ఇలా అయితే జట్టులో కొనసాగించడం కష్టమేనని రాణాను హెచ్చ‌రించాడ‌ట‌. నీ తీరు మార్చుకో.. బౌలింగ్ పైన ఫోకస్ పెట్టు అంటూ వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. విమర్శలు ఎన్నో వస్తాయి.. వాడిని పట్టించుకోకుండా గేమ్ పైన దృష్టి పెట్టు అని సూచనలు చేశాడట గౌతమ్ గంభీర్.

ఈ విషయాన్ని హర్షిత రాణా చిన్ననాటి కోచ్ శ్ర‌వ‌ణ్‌ బయటపెట్టారు. రెండో వన్డే పూర్తయిన తర్వాత గౌతమ్ గంభీర్ వార్నింగ్ ఇచ్చినట్లు తన చిన్ననాటి కోచ్ శ్ర‌వ‌ణ్ కు ఫోన్ చేసి చెప్పాడట హర్షిత్ రాణా. దీంతో ఈ విషయం వైర‌ల్ అయింది. అయితే, ఈ వార్నింగ్ త‌ర్వాత మూడో వ‌న్డేలో హ‌ర్షిత్ రాణా దుమ్ములేపాడు. ఏకంగా 4 వికెట్లు ప‌డ‌గొట్టి, ఆసీస్ కు చుక్క‌లు చూపించాడు రాణా. దీంతో విమ‌ర్శ‌లు చేసిన వారే, రాణాను మెచ్చుకుంటున్నారు. గంభీర్ న‌మ్మ‌కాన్ని కాపాడాడ‌ని అంటున్నారు.

Next Story