- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రెస్సింగ్ రూం విషయాలు లీక్..అందుకే సర్ఫరాజ్ పై వేటు !
టీమిండియా కోసం ఇటీవల కాలంలోనే 17 కేజీలు తగ్గి అద్భుతమైన ఫిట్నెస్ సాధించాడు సర్ఫరాజ్‌ఖాన్

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా ఏ వర్సెస్ దక్షిణాఫ్రికా ఏ జట్ల మధ్య త్వరలో నామమాత్రపు టెస్టులు జరగనున్నాయి. అనధికారికంగా జరగనున్న ఈ టెస్ట్ మ్యాచ్ ల నేపథ్యంలో భారత జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ లిస్టులో రిషబ్ పంత్ కు కెప్టెన్సీ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవల గాయపడి కోలుకున్న రిషబ్ పంత్ కు అవకాశం ఇవ్వడమే కాకుండా కెప్టెన్సీ ఇవ్వడం గమనార్హం. సాయి సుదర్శన్ కు వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. అయితే దేశవాళి, రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్‌ఖాన్ కు మాత్రం చోటు దక్కలేదు.
టీమిండియా కోసం ఇటీవల కాలంలోనే 17 కేజీలు తగ్గి అద్భుతమైన ఫిట్నెస్ సాధించాడు సర్ఫరాజ్‌ఖాన్. అయినప్పటికీ అతన్ని సెలెక్ట్ చేయలేదు బీసీసీఐ.దీని అంతటికి కారణం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అని తెలుస్తోంది. గతంలో బాక్సింగ్ డే టెస్ట్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ విషయాలను సర్ఫరాజ్‌ఖాన్ లీక్ చేశాడట. అప్పటి నుంచి సర్ఫరాజ్‌ఖాన్ పై కోపం పెంచుకున్నాడట గౌతమ్ గంభీర్. ఈ కారణంగానే తాజాగా ప్రకటించిన జట్టులో అతనికి ఛాన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది.






