ఎవరి హద్దుల్లో వాళ్లు ఉంటే మంచింది.. మూడో వన్డే అనంతరం కీలక వ్యాఖ్యలు చేసిన గంభీర్

by Harish |

సౌతాఫ్రికా చేతిలో భారత్ టెస్టు సిరీస్ వైట్‌వాష్ ఎదుర్కోవడంతో హెడ్ కోచ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఎవరి హద్దుల్లో వాళ్లు ఉంటే మంచింది.. మూడో వన్డే అనంతరం కీలక వ్యాఖ్యలు చేసిన గంభీర్
X

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా చేతిలో భారత్ టెస్టు సిరీస్ వైట్‌వాష్ ఎదుర్కోవడంతో హెడ్ కోచ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రధాన కోచ్‌గా అతన్ని తప్పించాలని డిమాండ్ వ్యక్తమైంది. సౌతాఫ్రికాతో మూడో వన్డే అనంతరం గంభీర్ తనపై వచ్చిన విమర్శలపై స్పందించాడు. క్రికెట్ గురించి తెలియని వాళ్లు కూడా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించాడు. ‘ఫలితాలు అనుకున్న విధంగా రానప్పుడు చాలా చర్చ జరుగుతుంది. కానీ, ఏ మీడియాలోనూ మేము తొలి టెస్టు ఎలా ఓడిపోయామన్నది రాయలేదు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేయకపోవడం వల్లే మేము ఓడిపోయాం. ప్రెస్ కాన్ఫరెన్స్‌ల్లో ఓటమికి నాకు సాకులు చెప్పడం లేదు. అలాగని మీరు నిజాలను ప్రపంచానికి తెలియజేయవద్దని అర్థం కాదు. జట్టు మార్పు దశలో ఉన్నప్పుడు, కెప్టెనే అందుబాటులో లేనప్పుడు ఇలాంటివి జరుగుతాయి. గిల్ ఫామ్‌లో ఉన్నప్పటికీ అతని సేవలను అందుబాటులో లేవు. దీని గురించి ఎవరూ మాట్లాడలేదు’అని వ్యాఖ్యానించాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ టెస్టు జట్టుకు స్పెషలిస్ట్ కోచ్ ఉండాలన్న వ్యాఖ్యలపై గంభీర్ పరోక్షంగా స్పందించాడు. ‘క్రికెట్ గురించి తెలియని వారు కూడా మాట్లాడుతున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనరు ఒకరు కోచింగ్ వ్యవస్థనే విభజించాలని అన్నారు. ఎవరైనా సరే తమ హద్దుల్లో ఉండటం ముఖ్యం.’అని ఘాటుగా రిప్లై ఇచ్చాడు.


Next Story