- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంభీర్ వల్లే సీనియర్లు రిటైర్.. షాకింగ్ కామెంట్స్ చేసిన మాజీ క్రికెటర్
గంభీర్ వల్లే సీనియర్లు రిటైర్ అవుతున్నారని, కావాలనే వాళ్లను జట్టు నుంచి తప్పిస్తున్నారని మనోజ్ తివారీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

దిశ, స్పోర్ట్స్: టీమిండియాలో సీనియర్లు ఒక్కొక్కరే రిటైర్‌మెంట్ తీసుకోవడం వెనుక హెడ్ కోచ్ గౌతం గంభీర్ హస్తముందా? సీనియర్లను జట్టు నుంచి తప్పించేందుకు గంభీర్ కుట్ర పన్నుతున్నాడా? అంటే అవుననే అంటున్నాడు మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ. అశ్విన్, రోహిత్, కోహ్లీ వంటి టాప్ ప్లేయర్లు జట్టులో ఉంటే.. గంభీర్, ఇతర కోచింగ్ స్టాఫ్ నిర్ణయాలు వారికి నచ్చకపోతే మొహమాటం లేకుండా వాటిని అడ్డుకుంటారని, అందుకే వారిని గంభీర్ బయటకు పంపేస్తున్నాడని తివారీ అంటున్నాడు.
‘కోహ్లీ, రోహిత్, అశ్విన్ వంటి వాళ్లు.. గంభీర్, మిగతా కోచింగ్ స్టాఫ్ కన్నా ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్లు. అలాంటి వాళ్లకు ఏదైనా విషయం నచ్చపోతే వెంటనే చెప్పేస్తారు. వారిని కంట్రోల్ చేయలేనప్పుడు బయటకు పంపేయడమే మంచి ప్లాన్ కదా’ అన్నాడు. కొత్త కోచ్ వచ్చిన తర్వాత టీమిండిచాలో చాలా కాంట్రవర్సీలు కనిపిస్తున్నాయని, ఇలాంటి విషయాలు క్రికెట్‌కు మంచిది కాదని తివారీ చెప్పాడు. క్రికెట్‌కు ఎంతో సేవ చేసిన కోహ్లీ, రోహిత్‌ను 2027 వన్డే వరల్డ్ కప్ ఆడించకపోతే అంతకన్నా దారుణమైన డెసిషన్ ఉండదన్నాడు.






