- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీంలో స్టార్ కల్చర్‌కు ఎండ్ కార్డ్.. ఫుల్ కంట్రోల్ అడిగిన గంభీర్
టీమిండియాలో స్టార్ కల్చర్‌కు ఎండ్ కార్డ్ వెయ్యాలని హెడ్‌కోచ్ గంభీర్ అనుకుంటున్నాడు. అందుకే ఫుల్ కంట్రోల్ ఇవ్వాలని బీసీసీఐని అడిగాడట.

దిశ, స్పోర్ట్స్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకున్నారు. దీంతో టీం ఫుట్ కంట్రోల్ తనకు ఇవ్వాలని బీసీసీఐని హెడ్ కోచ్ గంభీర్ అడిగాడట. జట్టులో సూపర్ స్టార్ సంస్కృతికి ముగింపు పలకాలనే ఆలోచనలో గంభీర్ ఉన్నాడట. అందుకే జట్టులో ఉన్న ప్లేయర్లంతా ఖాళీ దొరికితే దేశవాళీలు ఆడాల్సిందే అని తేల్చిచెప్పాడట. అలాగే విదేశీ పర్యటనలకు వెళ్తే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడట. కొత్త జట్టు కొంతకాలం ఇబ్బంది పడినా.. ఆ తర్వాత భవిష్యత్తు కోసం జట్టు బలంగా మారుతుందని గంభీర్ భావన.
కోహ్లీ, రోహిత్ రిటైర్‌మెంట్ వెనుక..
కొన్నిరోజుల క్రితం వరకు ఇంగ్లండ్ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నట్లు కోహ్లీ, రోహిత్ చెప్పారు. కానీ ఇద్దరూ సడెన్‌గా టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించేశారు. ఈ నిర్ణయం వెనుక కూడా గంభీర్ హస్తముందని కొందరి వాదన. ఇంగ్లండ్ సిరీస్ నుంచి కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ మొదలవుతున్న నేపథ్యంలో కుర్రాళ్లతో కూడిన జట్టుతో ముందుకు వెళ్లాలని గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ అనుకుంటున్నారట. ఇదే విషయాన్ని కోహ్లీ, రోహిత్‌లకు చెప్పడంతోనే ఇష్టం లేకపోయినా ఇద్దరూ టెస్టులకు వీడ్కోలు పలికారని సమాచారం.
చరిత్రలో ఇదే ఫస్ట్..
తరతరాలుగా భారత క్రికెట్‌ను కెప్టెన్లే ముందుండి నడిపించేవారు. కోచ్‌గా ఎంత గొప్ప ప్లేయర్ ఉన్నా సరే తను బ్యాక్ సీటులోనే ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ చరిత్రను తిరగరాస్తూ జట్టు మొత్తాన్ని గంభీర్ చేతుల్లోకి తీసుకున్నాడు. జట్టు ఎంపిక, రూల్స్ పెట్టడం వంటి అన్ని విషయాల్లో కెప్టెన్‌తో సమానంగా గంభీర్ పాత్ర ఉందట. ఇక ఇప్పుడు రోహిత్, కోహ్లీ, అశ్విన్ వంటి సీనియర్లంతా రిటైర్ అయిపోవడంతో టీం అంతా గంభీర్ మాట మీదనే నడిచే పరిస్థితి వచ్చేసింది. ‘న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా సిరీసుల్లో ఎదురైన పరాజయాలు రిపీట్ అవ్వకూడదంటే నాకు ఫుల్ కంట్రోల్ కావాలి’ అని బీసీసీఐకి గంభీర్ చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే బీసీసీఐ కూడా అతనికి ఫుల్ పవర్స్ ఇచ్చేసింది.
గంభీర్.. జర భద్రం..
ప్రస్తుతం టెస్టు టీంలో గంభీర్ ఆలోచనలకు ఎదురు చెప్పగలిగే ఒకేఒక్క ప్లేయర్ జస్‌ప్రీత్ బుమ్రా. అయితే పనిభారం వల్ల అతన్ని కెప్టెన్ చేసే అవకాశం లేదు. దీంతో శుభ్‌మన్ గిల్‌ను టెస్టు కెప్టెన్ చేస్తారని సమాచారం. భవిష్యత్తులో గిల్ పెద్ద స్టార్ ప్లేయర్ అవ్వొచ్చు కానీ.. ప్రస్తుతం అతను ఇంకా అంత పెద్ద ప్లేయర్ కాదు. కాబట్టి గంభీర్ ఏం చెప్పినా, దానికి ఎదురు చెప్పే ధైర్యం గిల్ చెయ్యలేడు. అంటే ఇకపై మ్యాచుల్లో కనిపించే వ్యూహాలన్నీ దాదాపు గంభీర్‌వే అయ్యుంటాయి. మరి ఇంత కంట్రోల్ ఇచ్చిన తర్వాత గంభీర్.. మ్యాచులు గెలిపిస్తాడో? ఓడిస్తాడో? ఏదేమైనా చాలామంది నిపుణులు ఇస్తున్న సలహా ఒకటే.. ‘గంభీర్.. జరభద్రం. జట్టును ముంచేయకు.’






