- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక గంభీర్ శకం షురూ.. కొత్త టీంను ఎలా నడిపిస్తాడో?
రోహిత్, కోహ్లీ రిటైర్‌మెంట్‌తో టెస్టుల్లో గంభీర్ శకం మొదైలంది. కొత్త టీంను ఇంగ్లండ్‌లో గంభీర్ ఎలా నడిపిస్తాడో చూడాలి.

దిశ, స్పోర్ట్స్: టెస్టు క్రికెట్‌కు స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీడ్కోలు పలికారు. దీంతో భారత టెస్టు క్రికెట్‌లో మరో కొత్త శకం మొదలైందని మాజీ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. రోహిత్, కోహ్లీ రోజుల వ్యవధిలోనే సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పడంతో భారత క్రికెట్‌లో ‘గంభీర్ శకం’ మొదలైందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. పెద్దగా అనుభవం లేని కుర్రాళ్లను ఇంగ్లండ్‌లో ముందుండి నడిపించడం గంభీర్ ముందున్న అతిపెద్ద సవాల్ అని, ఈ టీం కచ్చితంగా చాలా కొత్తగా ఉంటుందని అశ్విన్ అన్నాడు.
‘దీంతో కచ్చితంగా గంభీర్ శకం మొదలైనట్లే. ఈ టీంలో జస్‌ప్రీత్ బుమ్రానే అతిపెద్ద సీనియర్. ఈ జట్టు కచ్చితంగా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. బుమ్రాను కెప్టెన్ కూడా చెయ్యొచ్చు. కానీ తన ఫిజికల్ సామర్థ్యాన్ని బట్టి ఆ నిర్ణయం ఉంటుంది’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. అయితే వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా బుమ్రాను టెస్టు కెప్టెన్ చెయ్యకపోవడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. దీంతో శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్‌లలో ఒకరు టీమిండియా టెస్టు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది.






