పంజాబ్ ప్లేయర్ ను ఘోరంగా అవమానించిన అయ్యర్ !

by velandi.Saikiran |   (  Updated:2025-06-02 12:12:41  IST  )

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ఫైనల్ జట్లు ఏవి అనేది తేలిపోయింది. ఫైనల్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్

పంజాబ్ ప్లేయర్ ను ఘోరంగా అవమానించిన అయ్యర్ !
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ఫైనల్ జట్లు ఏవి అనేది తేలిపోయింది. ఫైనల్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడబోతున్నాయి. క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్ నేరుగా ఫైనల్ కి వెళ్ళింది. క్వాలిఫైయర్ 1 లో బెంగళూరు చేతిలో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్... ఇప్పుడు ఫైనల్ లో కూడా... అదే జట్టుతో తలపడబోతోంది.

అయితే ఇలాంటి నేపథ్యంలో.. చాలా కూల్ గా ఉండే... శ్రేయస్ అయ్యర్ కోపం బయటపడింది. సొంత ప్లేయర్ నే బండ బూతులు తిట్టేశాడు. ముంబై ఇండియన్స్ పై గెలిచిన తర్వాత... షేక్ హాండ్స్ ఇచ్చుకునే సమయంలో పంజాబ్ ఆటగాడు శశాంక్ సింగ్ ను ఉద్దేశించి మాటల్లో చెప్పలేని బూతులు తిట్టాడు శ్రేయస్ అయ్యర్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ముంబై వర్సెస్ పంజాబ్ మ్యాచ్ లో... కీలకమైన సమయంలో రనౌట్ అయ్యాడు శశాంక్ సింగ్. అయితే ఆ కోపాన్ని మ్యాచ్ పూర్తయిన తర్వాత బయట పెట్టాడు శ్రేయస్ అయ్యర్. ఇది ఇలా ఉండగా.. ముంబై ఇండియన్ పై ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్... 87 పరుగులతో దుమ్ము లేపాడు. చివరికి సిక్సర్ తో మ్యాచ్ ఫినిష్ చేశాడు శ్రేయస్ అయ్యర్.

Next Story