- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసిస్‌కు భారీ షాక్.. మూడో టెస్టు నుంచి స్టార్ బౌలర్ ఔట్
by Harish |
మూడో టెస్టులో ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

X
దిశ, స్పోర్ట్స్ : మూడో టెస్టులో ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజల్‌వుడ్ మళ్లీ గాయపడ్డాడు. దీంతో అతను మూడో టెస్టు మధ్యలోనే తప్పుకున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధ్రువీకరించింది. మిగతా సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. గాయం కారణంగా అతను రెండో టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. అయితే, బ్రిస్బేన్ మ్యాచ్ నాటికి కోలుకోవడంతో ఫిట్‌నెస్ లేకపోయినా తుది జట్టులోకి తీసుకున్నారు. మంగళవారం అతను ఒక్క ఓవర్ మాత్రమే వేసి మైదానాన్ని వీడాడు. అతని కుడి కాలు పిక్కలు పట్టేయడమే అందుకు కారణం. దీంతో మైదానం వీడిన అతన్ని స్కానింగ్ కోసం తీసుకెళ్లినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. గబ్బా టెస్టులో 6 ఓవర్లు వేసిన హేజల్‌వుడ్ ఒక్క వికెట్ పడగొట్టాడు.
- Tags
- #ind vs aus
Next Story






