విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది ఆ ఇద్దరే: మాజీ క్రికెటర్

by Gantepaka Srikanth |
విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది ఆ ఇద్దరే: మాజీ క్రికెటర్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియ దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేవలం క్రికెట్ చూసే వారికే కాకుండా అందరికీ కోహ్లీ సుపరిచితమే. ఇటీవల టీ20 ప్రపంచకప్ అనంతరం కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? అనే చర్చ అందరిలో మొదలైంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ లోటును శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ భర్తీ చేయగలరు అని అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుతం ఈ ఇద్దరు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఎంచుకోవడం కష్టం. రుతురాజ్ స్థిరంగా రాణిస్తుంటే.. గిల్ క్లాస్‌తో మెరిపిస్తున్నారు. వాళ్ల ఘనతలు, రికార్డులు చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. భారత జట్టులో ఇద్దరూ ఉంటే బాగుంటుంది’ అని చెప్పారు. కాగా, ఇటీవల జింబాబ్వే సిరీస్‌లో గిల్ కెప్టెన్‌గా వ్యవహరించి, సిరీస్ సాధించారు.




Next Story

Most Viewed