కరుణ్ నాయర్‌ది టెక్నికల్ సమస్యే.. కానీ ఈ ఏజ్‌లో మార్చుకోవడం కష్టం!

by Phanindra |

ఇంగ్లండ్‌లో విఫలమైన కరుణ్ నాయర్‌ది టెక్నికల్ సమస్యేనని, కానీ ఈ ఏజ్‌లో మార్చుకోవడం కష్టమని నిపుణులు చెప్తున్నారు.

కరుణ్ నాయర్‌ది టెక్నికల్ సమస్యే.. కానీ ఈ ఏజ్‌లో మార్చుకోవడం కష్టం!
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టుల్లో దారుణంగా నిరాశ పరిచిన కరుణ్ నాయర్ ఆటతీరు చూసిన నిపుణులు.. అతని బ్యాటింగ్‌లో ఉన్న సమస్యను ఎత్తిచూపుతున్నారు. మాజీ సెలెక్టర్, ఢిల్లీ రంజీ టీం కోచ్ దేవాంగ్ గాంధీ ఈ విషయాన్ని స్పష్టంగా వివరించాడు.

‘కరుణ్ చాలా కష్టపడుతున్న మాట వాస్తవమే. లీడ్స్‌లో మొదటి ఇన్నింగ్స్ మినహా ప్రతి ఇన్నింగ్సులో 30+ బంతులను ఎదుర్కొన్నాడు. క్రీజులో కుదురుకుంటున్నాడు. కానీ ఫలితం మాత్రం రావడం లేదు. దీనికి ప్రధాన కారణం అతని ట్రిగ్గర్ మూవ్‌మెంట్. గిల్ వంటి కుర్రాళ్లతో పోలిస్తే ఇది కొంచెం నెమ్మదిగా ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే.. పేస్ బౌలర్ బంతి విసిరే సమయంలో కరుణ్ ఫ్రంట్ ఫుట్ గాల్లో ఉంటుంది.

అలాంటప్పుడు తను బ్యాక్‌ఫుట్‌కు వెళ్లాలంటే కుదరదు. వోక్స వంటి మీడియం పేసర్‌ విషయంలో కరుణ్ టెక్నిక్‌లో ఇబ్బంది కనిపించదు. కానీ కార్సె, ఆర్చర్, స్టోక్స్ వంటి పేసర్ల బౌలింగ్‌లో ఇది పెద్ద సమస్యగా మారుతోంది’ అని దేవాంగ్ గాంధీ విశ్లేషించాడు. ఈ సమస్యను అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదని, కానీ వయసు రీత్యా ఇప్పుడు సడెన్‌గా తన టెక్నిక్ మార్చుకోవడం కరుణ్‌కు ఇబ్బందిగా ఉండొచ్చని గాంధీ వివరించాడు.

Next Story