మళ్లీ బ్యాట్ పట్టనున్న టీమిండియా మాజీ ఓపెనర్..

by Vinod kumar |

దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియా మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ - Former India opener Gautam Gambhir to play in 2nd edition of Legends League Cricket

మళ్లీ బ్యాట్ పట్టనున్న టీమిండియా మాజీ ఓపెనర్..
X

దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియా మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మళ్ళీ బ్యాట్ పట్టనున్నాడు. సెప్టెంబర్ 17 నుంచి జరగనున్న లెజెండ్ లీగ్ క్రికెటర్ రెండవ సీజన్‌లో పాల్గొంటున్నట్లు గంభీర్ ప్రకటించాడు. మరోసారి క్రికెట్ మైదానంలో అడుగు పెడుతుండడం పట్ల ఎంతో భావోద్వేగంగా ఉందన్నాడు. ప్రపంచ క్రికెట్ శోభలో మరోసారి భాగం అవుతుండడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు గంభీర్‌ తెలిపాడు. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నాడు.

లెజెండ్ లీగ్ క్రికెటర్ రెండవ సీజన్‌లో భాగంగా మొత్తం నాలుగు జట్ల మధ్య 15 మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత్‌కు చెందిన మహారాజాస్ జట్టుకు బీసీసీఐ చీఫ్ సౌరభ్ గంగూలీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ లీగ్‌లో ఇండియా నుంచి గంభీర్‌‌తో పాటుగా గంగూలీ, సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌ పాల్గొననున్నారు.

Next Story