ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్మిత్ కన్నుమూత

by Ajay Maddhiboyina |

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ బ్యాటర్ రాబిన్ స్మిత్ 62 కన్నుమూశారు. ఆస్ట్రేలియాలోనిపెర్త్ లో స్మిత్ తుదిశ్వాస విడిచారు. 1988 నుండి 1996 వరకు ఇంగ్లండ్ తరఫున స్మిత్ 62 టెస్టులు ఆడారు.

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్మిత్ కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ బ్యాటర్ రాబిన్ స్మిత్ 62 కన్నుమూశారు. ఆస్ట్రేలియాలోనిపెర్త్ లో స్మిత్ తుదిశ్వాస విడిచారు. 1988 నుండి 1996 వరకు ఇంగ్లండ్ తరఫున స్మిత్ 62 టెస్టులు ఆడారు. 43.67 సగటుతో 4,236 రన్స్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో పేస్ బౌలింగ్‌ను ధైర్యంగా ఎదుర్కొనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు సంపాదించుకున్నారు.

స్మిత్ ఇంట్లోనే అకస్మాత్తుగా ప్రాణాలు వదిలినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక దిగ్గజ క్రికెటర్.. ది జడ్జ్‌గా పేరు సంపాదించుకున్న స్మిత్ మరణం అభిమానులను, క్రికెట్ అభిమానులను విషాదంలోకి నెట్టివేసింది. ఆయన మరణానికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ సంతాపం ప్రకటించింది. ప్రపంచంలోని అరవీర భయంకర బౌలర్లకు భయపడకుండా బ్యాటింగ్ చేసిన రాబిన్ మరణం ఇంగ్లండ్ క్రికెట్‌కు తీరని లోటు అని ఈసీబీ పేర్కొంది.

Next Story