- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండుసార్లు వరల్డ్ కప్ లో ఛాన్స్..ఇప్పుడు బ్యాంక్ లో జాబ్ చేసే స్థితికి బౌలర్..!
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు నాథన్ బ్రాకెన్. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ప్రముఖ బ్యాంకులో అకౌంటెంట్ కూడా పనిచేస్తున్నాడు

దిశ, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియా ఒకప్పటి స్టార్ బౌలర్ నాథన్ బ్రాకెన్ ( Nathan Bracken ) గురించి తెలియని వారు ఉండరు. ఒకప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ వేసి ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవాడు. అంతేకాదు 2008 సమయంలో వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ గా కూడా ఎదిగాడు బ్రాకెన్. ఇటు 2003, 2007 ప్రపంచ కప్ లలో కూడా ఛాన్స్ దక్కించుకొని.. దుమ్ము లేపాడు. ఇక 2006 ఐసీసీ చాంపియన్ ట్రోఫీలో కూడా ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగాడు ఈ డేంజర్ ఆటగాడు నాథన్ బ్రాకెన్.
2001లో యంగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, 2009లో ఆస్ట్రేలియా వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను కూడా దక్కించుకున్నాడు. ఇక 2012 తర్వాత నాథన్ బ్రాకెన్.. కెరీర్ పూర్తిగా డౌన్ అయింది. మోకాలి గాయం కారణంగా... తొందరగానే రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు నాథన్ బ్రాకెన్. అలాంటి నాథన్ బ్రాకెన్... ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ప్రముఖ బ్యాంకులో అకౌంటెంట్ కూడా పనిచేస్తున్నాడు. ఇక నాథన్ బ్రాకెట్ కు భార్య ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని వయసు ప్రస్తుతం 47 సంవత్సరాలు.






