క్రికెట్ ప్రపంచంలో విషాదం.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ కన్నుమూత

by Malleboina Mahesh |   (  Updated:2025-08-16 04:34:59  IST  )

క్రికెట్ ప్రపంచంలో శనివారం తీవ్ర విషాదం నెలకొంది. క్రికెట్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ సిమన్స్ (89) మృతి చెందారు.

క్రికెట్ ప్రపంచంలో విషాదం.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్: క్రికెట్ ప్రపంచంలో శనివారం తీవ్ర విషాదం నెలకొంది. క్రికెట్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బాబ్ సింప్సన్ (Former Australian captain Bob Simpson) (89) మృతి చెందారు. వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున చివరి శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. సిమన్స్ 1957 నుంచి 1978 వరకు మొత్తం 68 టెస్టులు ఆడిన ఆయన 4,869 రన్స్ చేశాడు. అలాగే బౌలింగ్ లో 71 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే బాబ్ సింప్సన్ వ్యక్తిగత కారణాల వల్ల 1968లో జట్టు నుంచి తప్పుకున్నాడు. అనంతరం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని 1977లో 41 ఏళ్ల వయస్సులో క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఒక సంవత్సరంలోనే ఫిట్ నెస్ సమస్య కారణంగా పూర్తి స్థాయి రిటైర్మెంట్ తీసుకున్నాడు. అనంతరం ఆస్ట్రేలియా జట్టు కోచ్ గా బాధ్యతలు తీసుకుని 1987లో ఆస్ట్రేలియా జట్టుకు యాషెస్ టెస్ట్ సిరీస్ గెలిపించాడు. సిమన్స్ మృతితో క్రికెట్ ప్రపంచంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో ఆయన మృతి క్రికెటర్లు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.

Next Story