చరిత్రలో ఫస్ట్ టైమ్.. ఇక అంపైర్లు, రిఫరీలుగా మహిళలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-11 08:56:41  IST  )

ఇంటర్‌నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) మరో కీలక నిర్ణయం తీసుకున్నది.

చరిత్రలో ఫస్ట్ టైమ్.. ఇక అంపైర్లు, రిఫరీలుగా మహిళలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్‌నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇండియా హోస్ట్‌గా నిర్వహించబోతున్న మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ (Women's ODI World Cup)లో అంపైర్లతో పాటు మ్యాచ్ రిఫరీలు మహిళలే ఉండనున్నారు. అయితే, టోర్నీ చరిత్రలో ఫస్ట్ టైమ్ పూర్తిగా మ్యాచ్‌ను మహిళలతో ప్రపంచకప్‌ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 30 నుంచి నవంబర్ 2 వరకు మొత్తం 5 వేదికల్లో టోర్నమెంట్ కొనసాగనుంది. ఇండియాలోని చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు), ఏసీఏ స్టేడియం (గువాహటి), హోల్కర్ స్టేడియం (ఇందౌర్), ఏసీఏ -వీడీసీఏ స్టేడియం (విశాఖపట్నం), ఆర్. ప్రేమదాస స్టేడియం (కొలంబో) మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

Next Story