నేపాల్ క్రికెటర్లకు.. టీమిండియా ఫాస్ట్ బౌలర్ సూచనలు

by Geesa Chandu |

నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) బెంగళూరు ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనేందుకు.. నేపాల్ క్రికెట్ టీమ్, భారత్ కు వచ్చింది.

నేపాల్ క్రికెటర్లకు.. టీమిండియా ఫాస్ట్ బౌలర్ సూచనలు
X

దిశ, వెబ్ డెస్క్: నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA) బెంగళూరు ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనేందుకు.. నేపాల్ క్రికెట్ టీమ్, భారత్ కు వచ్చింది. ఇక్కడే రెండు వారాల పాటు ఈ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొననుంది. ఐసీసీ మెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2 కోసం.. నేపాల్ క్రికెట్ టీమ్, బెంగళూరులోని శిక్షణా శిబిరాన్ని ప్రాక్టీస్ కోసం వినియోగించుకుంటుంది. నేపాల్ ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ లో ఉండగా.. భారత స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ నేపాల్ టీమ్ తో కొంత సమయాన్ని గడిపాడు. వారికి తన విలువైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అయితే షమీ కూడా ప్రస్తుతం అక్కడే ఉండడంతో, నేపాల్ జట్టును కలిసి సరదాగా వారితో ముచ్చటించాడు. కాగా నేపాల్ జట్టు భారత్ లో పర్యటించడం ఈ ఏడాదిలో రెండో సారి. అంతకుముందు ప్రపంచకప్ సన్నాహకంలో భాగంగా గుజరాత్ లో శిక్షణ పొందుతున్న సమయంలో, బరోడాతో జరిగిన కొన్ని మ్యాచ్ లలో పాల్గొంది. దాంట్లో నేపాల్, గుజరాత్, బరోడా జట్లు పాల్గొన్నాయి. అయితే షమీ సెప్టెంబర్లో జరగబోయే బంగ్లాదేశ్ సిరీస్ కు దూరం కానున్నాడు. కారణం అతనికి తగిన ఫిట్నెస్ లేకపోవడమే. దీంతో షమీ ఫిట్నెస్ సాధించడానికి రంజీ ట్రోఫీ ఆడనున్నాడని తెలుస్తోంది. తన సొంత జట్టు బెంగాల్ తరపున అక్టోబర్ 11 న ఉత్తరప్రదేశ్ తో మ్యాచ్ ఆడడడానికి షమీ సిద్ధం అవుతున్నాడు. రంజీ ట్రోఫీలో ఈ ఫాస్ట్ బౌలర్ కేవలం రెండు మ్యాచ్ లే ఆడనున్నాడని సమాచారం. తరువాత అక్టోబర్లో న్యూజిలాండ్ తో జరగబోయే 3 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు షమీ అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.

Next Story