ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఫుడ్‌ పాయిజన్‌.. బీసీసీఐ రియాక్షన్ ఇదే

by Kema Shiva Kumar |

భారత్-A, ఆస్ట్రేలియా-A జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌ హాట్ టాపిక్‌గా మారింది.

ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఫుడ్‌ పాయిజన్‌.. బీసీసీఐ రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్-A, ఆస్ట్రేలియా-A జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌ హాట్ టాపిక్‌గా మారింది. కాన్పూర్‌ (Kanpur)లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు కెప్టెన్ జాక్ ఎడ్వర్డ్స్, హెన్సీ థార్న్‌టన్ సహా మరో ఇద్దరికి ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో హుటాహుటిన వారిని కాన్పూర్‌లోని రెజెన్సీ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల చికిత్స అనంతరం వారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఫుడ్ పాయిజన్ ఘటనపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా (Rajiv Shukla) స్పందించారు. ఫుడ్ వల్ల వచ్చిన సమస్య అయితే అందరూ అనారోగ్యం బారిన పడాలని, కానీ అలా జరగలేదని అన్నారు. ఇన్ఫెక్షన్ వేరే చోటి నుంచి వచ్చి ఉండవచ్చని కామెంట్ చేశారు. కాన్పూర్‌లో ల్యాండ్‌మార్క్ హోటల్ అత్యుత్తమ హోటల్ అని, అక్కడ మంచి ఆహారమే ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఆటగాళ్లు తిన్న ఫుడ్‌ నమూనాలను ల్యాబ్‌కు పంపించారని, రిపోర్టు రాగానే బాధ్యులపై చర్యలు ఉంటాయని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.

Next Story