ముందు ఆటపై ఫోకస్ పెట్టండి.. పాక్‌కు కపిల్ దేవ్ హితవు

by Harish |   (  Updated:2025-09-18 15:53:05  IST  )

పాకిస్తాన్ ప్లేయర్లు వివాదాలపై కాకుండా తమ ఆటపై దృష్టి పెట్టాలని భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ హితవు పలికాడు.

ముందు ఆటపై ఫోకస్ పెట్టండి.. పాక్‌కు కపిల్ దేవ్ హితవు
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ ప్లేయర్లు వివాదాలపై కాకుండా తమ ఆటపై దృష్టి పెట్టాలని భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ హితవు పలికాడు. ఆసియా కప్‌లో టీమిండియా ప్లేయర్లు హ్యాండ్‌షేక్ ఇవ్వలేదని పాక్ నానా రాద్ధాంతం చేస్తోంది. దీనిపై తాజాగా ఓ జాతీయ మీడియాతో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. పాక్ ఆట అసలు బాగా లేదని, ముందు మంచి క్రికెట్ ఆడంటూ వ్యాఖ్యానించాడు. ‘షేక్ హ్యాండ్ లేదా హగ్ ఇవ్వాలా.. లేదా? అన్నది పర్సనల్ చాయిస్. ఎవరైనా హేక్‌హ్యాండ్ ఇవ్వకపోతే దాన్ని ఇంత పెద్ద సమస్య చేయాల్సిన అవసరం లేదు. తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇవన్నీ చాలా చిన్న విషయాలు. పాక్ జట్టు ఆటపై ఫోకస్ పెట్టాలి. ఆ జట్టు మంచి క్రికెట్ ఆడటం లేదు. వాళ్లు దానిపై కష్టపడాలి.’అని పాక్‌కు కపిల్ బుద్ది చెప్పాడు.


Next Story