ఫ్లాష్.. ఫ్లాష్.. : క్రికెటర్Rishabh Pantకు రోడ్డుప్రమాదం

by Sathputhe Rajesh |   (  Updated:2022-12-30 04:21:33  IST  )

టీమిండియా వికెట్ కీపర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

ఫ్లాష్.. ఫ్లాష్.. : క్రికెటర్Rishabh Pantకు రోడ్డుప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వికెట్ కీపర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా రూర్కీ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో తన మెర్సిడెస్ బెంజ్ కారును రిషభ్ పంతే నడుపుతున్నట్లు తెలిసింది. రూర్కీ వద్ద డివైడర్‌ను రిషబ్ పంత్ కారు బలంగా ఢీకొట్టింది. రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదం తర్వాత మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. రిషబ్ పంత్‌కు తలకు, వీపు భాగంలో తీవ్రగాయాలు కాగా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో రిషభ్ పంత్ ఒక్కడే ఉన్నట్లు సమాచారం.

Also Read...

ఫుట్‌బాల్ దిగ్గజ ప్లేయర్ పీలే కన్నుమూత

Next Story