భార‌త జ‌ట్టుకు బిగ్ రిలీఫ్‌..రెండో టీ20 కోసం ఆ డేంజ‌ర్ ప్లేయ‌ర్‌

by velandi.Saikiran |

రెండో టీ20 సమయానికి వాషింగ్టన్ సుందర్ భారత జట్టులో చేరతాడని శుభవార్త చెప్పారు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.

భార‌త జ‌ట్టుకు బిగ్ రిలీఫ్‌..రెండో టీ20 కోసం ఆ డేంజ‌ర్ ప్లేయ‌ర్‌
X

దిశ‌, వెబ్ డెస్‌: టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో భారత జట్టుకు భారీ ఊరట లభించింది. మొదటి టీ20 గెలిచిన భారత జట్టులోకి మరో కొత్త ప్లేయర్ రాబోతున్నాడు. ఈ మధ్య కాలంలో వరుస గాయాలతో భారత జట్టు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. చివరి క్షణంలో హర్షిత్ రాణా లాంటి డేంజర్ బౌలర్ భారత జట్టుకు దూరమయ్యారు. దీంతో హుటా హుటిన మహమ్మద్ సిరాజ్ లాంటి బౌలర్ ను దింపాల్సి వచ్చింది. అటు టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ కంటే ముందే వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు.

వాషింగ్టన్ సుందర్ వ‌చ్చేస్తున్నాడు..సూర్య ప్ర‌క‌ట‌న‌

అయితే అతని హెల్త్ అప్డేట్ తాజాగా సూర్య కుమార్ యాదవ్ ఇచ్చారు. రెండో టీ20 సమయానికి వాషింగ్టన్ సుందర్ భారత జట్టులో చేరతాడని శుభవార్త చెప్పారు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. ఇందులో ఎలాంటి డౌట్ లేదని క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ వేదికగా నమీబియా వర్సెస్ భారత జట్టు మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఈ నెల 12వ తేదీన జ‌రుగ‌నుంది. అంటే మ‌రో నాలుగు రోజుల గ్యాప్ ఉంటుంది. ఈ మ్యాచ్ సందర్భంగా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వస్తాడని తెలిపారు. టీ20 వరల్డ్ కప్ కంటే ముందు భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డేలు, టీ20 సిరీస్ జరిగింది. అయితే తొలి వన్డే సందర్భంగా భారత ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ చేతికి గాయమైది. దీంతో న్యూజిలాండ్ తో జరిగిన వన్డేలు, టీ20లకు దూరమయ్యాడు వాషింగ్టన్ సుందర్.

ఆ సమయంలో వాషింగ్టన్ సుందర స్థానంలో ఆయుష్ బదోనిని స్క్వాడ్‌ లోకి తీసుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే అతనికి ఆడే అవకాశం పెద్దగా రాకపోయినా.. న్యూజిలాండ్ సిరీస్ కోసం మాత్రం తీసుకున్నారు. అయితే ఇప్పటికే వాషింగ్టన్ సుందర్ కోలుకున్నాడని సూర్య కుమార్ యాదవ్ తాజాగా తెలిపారు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు ఆడే రెండో టీ20కి అందుబాటులోకి కూడా రాబోతున్నారట. దీంతో భారత జట్టు శిబిరంలో నూతన ఉత్సాహం నెలకొంది. ఒకవేళ వాషింగ్టన్ సుందర్ రెండవ టీ20లో బరిలోకి దిగితే ఒకరిపై వేటుపడే ప్రమాదం ఉంటుంది. వరుణ్ చక్రవర్తిని పక్కకు పెట్టే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అతన్ని ఈ టోర్నమెంట్ నాకౌట్ దశలో వాడుకునేందుకు సూర్య కుమార్ యాదవ్ ప్లాన్ చేస్తున్నారట. గ్రూప్ స్టేజ్ లో వరుణ్ చక్రవర్తిని పక్కకు పెడతారని అంటున్నారు. దీంతో అతని స్థానంలో వాషింగ్టన్ సుందరకు ఛాన్స్ వస్తుంది.

భార‌త జ‌ట్టు షెడ్యూల్

టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఫిబ్రవరి 7వ తేదీన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో భారత్ మ్యాచ్ ఆడింది. ఇందులో భారత జట్టు 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక 12వ తేదీన నమీబియాతో మరో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ ఢిల్లీ వేదికగా జరుగుతుంది. ఫిబ్రవరి 15వ తేదీన పాకిస్తాన్, ఫిబ్రవరి 18వ తేదీన నెదర్లాండ్స్ తో భార‌త‌ మ్యాచ్ లు షెడ్యూల్ అయ్యాయి.

Next Story