- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరల్డ్ రికార్డు నెలకొల్పిన పాండ్యా.. ఏకైక పేస్ ఆల్‌రౌండర్‌గా ఘనత
by Harish |
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు.

X
దిశ, స్పోర్ట్స్ : టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు.అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. మూడో టీ20లో ట్రిస్టన్ స్టబ్స్‌ను అవుట్ చేయడంతో ఈ ఫీట్ సాధించడాడు. టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన మూడో భారత పేసర్. అర్ష్‌దీప్ సింగ్(112), జస్‌ప్రీత్ బుమ్రా(101) అతని కంటే ఈ మైలురాయిని చేరుకున్నారు. అలాగే, అంతర్జాతీయ టీ20ల్లో 1000+ రన్స్‌తో పాటు 100 వికెట్లు పడగొట్టిన తొలి పేస్ ఆల్‌రౌండర్‌గా కూడా హార్దిక్ చరిత్రకెక్కాడు. స్పిన్ ఆల్‌రౌండర్లు షకీబ్ అల్ హసన్, మహమ్మద్ నబీ, సికిందర్ రాజా ఈ ఫీట్ సాధించగా.. పేసర్ ఆల్‌రౌండర్ మాత్రం పాండ్యానే. టీ20ల్లో ఇప్పటి వరకు 123 మ్యాచ్‌లు ఆడిన అతను 100 వికెట్లు పడగొట్టడంతోపాటు 1,939 పరుగులు చేశాడు.
Next Story






