AFG Vs HKC: ఆసియా కప్ తొలి సమరం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గానిస్తాన్

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-09 15:06:35  IST  )

యూఏఈ వేదికగా ఆసియా కప్‌ మెగా టోర్నీకి తెర లేచింది.

AFG Vs HKC: ఆసియా కప్ తొలి సమరం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గానిస్తాన్
X

దిశ, వెబ్‌డెస్క్: యూఏఈ వేదికగా ఆసియా కప్‌ మెగా టోర్నీకి తెర లేచింది. మొత్తం ఎనిమిది జట్లు టైటిల్ వేటకు సిద్ధమయ్యాయి. టోర్నమెంట్‌లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్‌లో గ్రూప్-బీలోని ఆఫ్ఘనిస్తాన్‌తో హాంకాంగ్ తలపడుతుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన ఆఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, యూఏఈ లోని అబుదాబి, దుబాయ్ వేదికలుగా మ్యాచ్‌లు జరగనున్నాయి. నేడు ఈ టోర్నీ ప్రారంభమై సెప్టెంబర్ 28న ముగుస్తోంది. మొత్తం ఎనిమిది జట్లు పోటీలో ఉండగా గ్రూప్‌‌‌‌-ఏలో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్‌‌‌, గ్రూప్‌‌‌‌‌‌-బీలో శ్రీలంక, అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌, హాంకాంగ్‌‌‌‌‌‌‌‌ బరిలో నిలిచాయి. దుబాయ్‌‌‌‌‌‌‌‌, అబుదాబి వేదికలుగా ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా 19 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు జరుగుతాయి.

అఫ్గానిస్తాన్ జట్టు: గుర్బాజ్‌, అటల్‌, జర్దాన్‌, ఒమర్జాయ్‌, నయీబ్‌, జనత్‌, రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబీ, నూర్‌ అహ్మద్‌, ఘజన్‌ఫర్‌, ఫరూఖీ.

హాంకాంగ్‌ జట్టు: జీషన్‌, బాబర్‌ హయత్‌, అన్షుమాన్‌, కల్హన్‌, నిజకత్‌, అయిజాజ్‌, కించిత్‌ షా, యాసిమ్‌, ఆయుష్‌ శుక్లా, అతీక్‌, ఇహ్‌శాన్‌ ఖాన్‌.

Next Story