- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శాంసన్‌కు గాయం.. 5-6 వారాలు రెస్ట్.. వికెట్ కీపర్ ఐపీఎల్ ఆడతాడా?
ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20లో టీమ్ ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ గాయపడ్డాడు.

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20లో టీమ్ ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ గాయపడ్డాడు. అతని కుడి చేతికి గాయమైంది. ఆర్చర్ వేసి తొలి ఓవర్‌లో శాంసన్ వేలికి బంతి బలంగా తాకింది. ఫిజియోలు వచ్చి చిక్సిత అందించారు. ఆ తర్వాత శాంసన్ బ్యాటింగ్ కొనసాగించినా.. ఆ తర్వాతి ఓవర్‌లో వికెట్ కోల్పోయాడు. అయితే, ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో అతను కీపింగ్ చేయలేదు. శాంసన్ స్థానంలో ధ్రువ్ జురెల్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. గాయం కారణంగా శాంసన్ 5-6 వారాలు ఆటకు దూరం కానున్నాడు. ‘శాంసన్ కుడి చేతి ఇండెక్స్ ఫింగర్ ఫ్రాక్చర్ అయ్యింది. కాబట్టి, ఐదు నుంచి ఆరు వారాలు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల అతను రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌కు అతను ఆడే చాన్స్ లేదు.’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో అతను కేరళ జట్టుకు ఆడుతున్నాడు. ఈ నెల 8 నుంచి 12 వరకు జరిగే క్వార్టర్ ఫైనల్‌లో జమ్ము కాశ్మీర్‌తో కేరళ తలపడనుంది. గాయం కారణంగా శాంసన్ ఈ మ్యాచ్‌కు దూరంకానున్నాడు. అతను పునరావాసం కోసం శాంసన్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరనున్నాడు. ఐపీఎల్ నాటికి శాంసన్ తిరిగి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, రాజస్థాన్ రాయల్స్ శిక్షణ శిబిరానికి అతను దూరమయ్యే చాన్స్ ఉంది. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 35 పరుగులే చేశాడు.






