బుమ్రా ఫిట్‌గా ఉన్నాడా? లేదా?.. నేడు బీసీసీఐ నిర్ణయం

by Harish |
బుమ్రా ఫిట్‌గా ఉన్నాడా? లేదా?.. నేడు బీసీసీఐ నిర్ణయం
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీ ఆడటంపై సందిగ్ధం కొనసాగుతోంది. వెన్ను గాయం బారిన పడిన అతని ఫిట్‌నెస్‌పై బోర్డు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఐసీసీ టోర్నీకి గత నెలలో ప్రకటించిన భారత జట్టులో బుమ్రాను చేర్చారు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదో టెస్టులో వెన్ను నొప్పితో బాధపడిన బుమ్రా ఆ తర్వాత మరో మ్యాచ్ ఆడలేదు. ఇటీవల నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో బుమ్రాకు టెస్టులు పూర్తిచేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఇంకా అతని ఫిట్‌నెస్‌పై ఎలాంటి అప్‌డేట్ రాలేదు. చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్టులో మార్పులు చేయడానికి నేడు తుది గడువు. కాబట్టి, బుమ్రాపై బీసీసీఐ మంగళవారం నిర్ణయం తీసుకోనుంది. బుమ్రాను జట్టులో కొనసాగించే అవకాశం ఉందని క్రీడా వర్గాలు తెలిపాయి. గ్రూపు దశకు దూరమైనా తర్వాతి రౌండ్‌కు అందుబాటులోకి వచ్చే చాన్స్ ఉంటే అతన్ని జట్టులో కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, రిప్లేస్‌‌‌మెంట్ ద్వారా కూడా టోర్నమెంట్ టెక్నికల్ కమిటీ ఆమోదంతో బుమ్రాను జట్టులోకి తీసుకోవచ్చు. ఒకవేళ అతను ఫిట్‌‌గా లేకుంటే మాత్రం బుమ్రా స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే, బుమ్రా ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి వస్తాడని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆశాభావం వ్యక్తం చేశాడు. అతని వస్తే మా బలం మరింత పెరుగుతుందన్నాడు.

Next Story