- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
FIDE Women’s World Cup : చరిత్ర సృష్టించిన హంపి.. ఆ ఘనత సాధించిన తొలి భారత గ్రాండ్‌మాస్టర్
ఫిడే మహిళల వరల్డ్ కప్‌లో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి సెమీస్‌కు చేరుకుంది.

దిశ, స్పోర్ట్స్ : జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల వరల్డ్ కప్‌లో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి సెమీస్‌కు చేరుకుంది. వరల్డ్ కప్‌లో సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి ఇండియన్‌గా ఘనత సాధించింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో ఆమె 1.5-0.5 తేడాతో చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్‌పై విజయం సాధించింది. రెండు క్లాసికల్ గేముల్లో శనివారమే హంపి తొలి గేము నెగ్గి విజయానికి చేరువైంది. ఆదివారం జరిగిన రెండో గేమును యుక్సిన్ సాంగ్‌తో కలిసి డ్రా చేసుకుంది. నల్ల పావులతో ఆడిన ఆమె 53 ఎత్తుల్లో పాయింట్స్ పంచుకుంది. సెమీస్‌లో హంపి చైనాకు చెందిన లీ టింగ్జీతో తలపడనుంది. మరోవైపు, మరో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.వైశాలి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. క్వార్టర్స్‌లో రెండో గేమును చైనాకు చెందిన టాంగ్ జోంగి చేతిలో కోల్పోవడంతో మ్యాచ్‌ను 1.5-0.5తో ఓడిపోయింది. ఇక, దివ్య దేశ్‌ముఖ్, ద్రోణవల్లి హారిక మధ్య జరుగుతున్న క్వార్టర్స్ ట్రై బ్రేకర్‌కు వెళ్లింది. తొలి గేమును డ్రా చేసుకున్న వీరు రెండో గేములోనూ పాయింట్స్ పంచుకున్నారు. నేడు టై బ్రేకర్ జరగనుంది.






