భారత బాస్కెట్‌బాల్ జట్టు జోరు.. ఆసియా కప్‌లో క్వార్టర్స్‌కు అర్హత

by Harish |

బాస్కెట్ బాల్ 3x3 ఆసియా కప్‌లో భారత్‌ జోరు కొనసాగుతోంది.

భారత బాస్కెట్‌బాల్ జట్టు జోరు.. ఆసియా కప్‌లో క్వార్టర్స్‌కు అర్హత
X

దిశ, స్పోర్ట్స్ : సింగపూర్‌లో జరుగుతున్న బాస్కెట్ బాల్ 3x3 ఆసియా కప్‌లో భారత్‌ జోరు కొనసాగుతోంది. టోర్నీలో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత పురుషుల బాస్కెట్‌బాల్ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. 12 ఏళ్ల తర్వాత ఇండియా క్వార్టర్స్‌కు అర్హత సాధించడం గమనార్హం. ఇంతకుముందు 2013లో జరిగిన ఆరంభ టోర్నీలో టాప్-8లో నిలిచింది. ప్రిలిమినరీ రౌండ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 21-18 తేడాతో చైనీస్ తైపీపై విజయం సాధించింది. అరవింద్ ముత్తు 9 పాయింట్లతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, శుక్రవారమే జరిగిన మరో మ్యాచ్‌లో చైనా చేతిలో 21-19 తేడాతో పరాజయం తప్పలేదు. అయితే, చైనీస్ తైపీపై విజయంతోనే భారత్‌కు క్వార్టర్స్ బెర్త్‌ ఖరారైంది. క్వార్టర్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.


Next Story