క్రికెట్ లవర్స్‌కు పండుగలాంటి వార్త.. WPL-2026 షెడ్యూల్ విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-29 07:14:06  IST  )

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026 పూర్తి షెడ్యూల్‌ను ఇవాళ బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

క్రికెట్ లవర్స్‌కు పండుగలాంటి వార్త.. WPL-2026 షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026 పూర్తి షెడ్యూల్‌ను ఇవాళ బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. 2026 జనవరి 9న నవీ ముంబైలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో టోర్నీ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌ను నవంబర్ 27న జరిగిన మెగా వేలంలోనే WPL చైర్మన్ జయేష్ జార్జ్ ముందుగా ప్రకటించిన తేదీలకు అనుగుణంగానే విడుదల చేశారు. 28 రోజుల్లో రెండు వేదికల్లో మొత్తం 22 మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఇక ఫస్ట్ ఫేజ్ మ్యాచ్‌లు జనవరి 9 నుంచి 17 వరకు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో, సెకండ్ ఫేజ్ మ్యాచ్‌లు ఫైనల్‌తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్‌లు జనవరి 19 నుంచి ఫిబ్రవరి 5 వరకు వడోదరలోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్నాయి. ఇటీవల జరిగిన WPL మెగా వేలంలో మొత్తం 277 మంది క్రీడాకారిణులు రిజిస్టర్ చేసుకోగా, అందులో కేవలం 67 మంది మాత్రమే అమ్ముడయ్యారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్, దీప్తి శర్మ వంటి స్టార్లు భారీ ధర పలికారు. కాగా, ఈ టోర్నీని జనవరి-ఫిబ్రవరిలోనే నిర్వహించడంతో ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న పురుషుల టీ20 వరల్డ్ కప్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరుగనుంది. WPL-2026 టికెట్లు, లైవ్ టెలికాస్ట్‌కు సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది.

Next Story