- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Champions Trophy : కివీస్‌కు బిగ్ షాక్.. చాంపియన్స్ ట్రోఫీకి మరో స్టార్ బౌలర్ దూరం
చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ఒక్క రోజు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది.

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ఒక్క రోజు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. కివీస్ స్టార్ పేసర్ ఫెర్గూసన్ గాయం కారణంగా ఐసీసీ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఆదివారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫెర్గూసన్ కాలి గాయమైంది. కుడి పాదంతో అసౌకర్యంగా కనిపించాడు. గాయం నుంచి కోలుకోవడానికి ఫెర్గూసన్‌కు సమయం పట్టనుంది. టోర్నీలో పాల్గొనేంత ఫెర్గూసన్ ఫిట్‌గా లేడని న్యూజిలాండ్ క్రికెట్ తెలిపింది. అతన్ని తిరిగి న్యూజిలాండ్‌కు పంపించనున్నట్టు పేర్కొంది. కివీస్ బోర్డు ఫెర్గూసన్ స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్ కైల్ జేమీసన్‌ను జట్టులోకి తీసుకుంది. జేమీసన్ చివరిసారిగా 2020లో చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. గతేడాది ఫిబ్రవరిలో సౌతాఫ్రికాతో టెస్టులో చివరిసారిగా కివీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. దాదాపు ఏడాది తర్వాత అతను జాతీయ జట్టులోకి రానున్నాడు. చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన రెండో కివీస్ ఆటగాడు ఫెర్గూసన్. పేసర్ బెన్ సియర్స్ తొడ కండరాల గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో జాకబ్ డఫీని భర్తీ చేసిన విషయం తెలిసిందే. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బుధవారం ఓపెనింగ్ మ్యాచ్‌లో కివీస్.. పాకిస్తాన్‌తో తలపడనుంది.






