Vakiti Srihari: మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన మహిళా క్రికెట్ ప్లేయర్ అరుంధతి రెడ్డి

by Ramesh Naini |

టీం ఇండియా మహిళా క్రికెట్ ప్లేయర్, ఫాస్ట్‌ బౌలర్‌ అరుంధతి రెడ్డి ని తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందించారు.

Vakiti Srihari: మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన మహిళా క్రికెట్ ప్లేయర్ అరుంధతి రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీం ఇండియా మహిళా క్రికెట్ ప్లేయర్, ఫాస్ట్‌ బౌలర్‌ అరుంధతి రెడ్డి (Arundhati Reddy)ని తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) అభినందించారు. ఈ మేరకు ఇవాళ (శుక్రవారం) మంత్రి వాకిటి శ్రీహరిని కలిశారు. ఇటీవల జరిగిన (Women's World Cup) ఉమెన్స్ వరల్డ్ కప్‌లో తనదైన పాత్ర పోషించిన అరుంధతి రెడ్డిని.. క్రీడా శాఖ మంత్రి ఆమెకు శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారి వీసీ, ఎండీ సోనీ బాలాదేవి, కోచ్ ఆకాష్, తదితరులు పాల్గొన్నారు. కాగా, దక్షిణాఫ్రికాపై ఫైనల్లో విజయం సాధించి మహిళ ప్రపంచకప్‌ గెలుచుకున్న భారత క్రికెట్‌ జట్టులో ఒకరైనా అరుంధతి రెడ్డికి గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. తెలంగాణకు గర్వకారణంగా అరుంధతి రెడ్డి నిలిచిందని కుటుంబ సభ్యులు, అభిమానులు, సన్నిహితులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు వచ్చి ఆమెను అభినందించారు.

Next Story