భారత బ్యాటర్లు భయంతో ఆడుతున్నారు.. టీమ్ మేనేజ్‌మెంట్‌పై మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు

by Harish |

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓటమికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బ్యాటర్లను నిందించడంపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

భారత బ్యాటర్లు భయంతో ఆడుతున్నారు.. టీమ్ మేనేజ్‌మెంట్‌పై మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓటమికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బ్యాటర్లను నిందించడంపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ కోచింగ్‌లో టెస్టు బ్యాటర్లలో అభద్రతా భావం నెలకొందని, జట్టులో చోటు కోసం వారు భయం భయంగా ఆడుతున్నారని వ్యాఖ్యానించాడు. టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి బ్యాటర్లకు మద్దతు కరువైందన్నాడు. ‘ఆటగాళ్లు తమను తాము నమ్మడం లేదు. వారిలో అభద్రత ఉంది. అభద్రతా భావం ఉన్నప్పుడు టర్నింగ్ పిచ్‌లపై రాణించలేరు. బ్యాటర్లకు మద్దతు లేదు. ప్రతి ఒక్కరూ భయంతో ఆడుతున్నారు.’అని కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తరుచుగా జట్టులో మార్పులు చేస్తుండటంతో ఆటగాళ్లలో గందరగోళం నెలకొందన్నాడు. బాగా ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్, సాయి సుదర్శన్‌ను తప్పించడాన్ని ప్రశ్నించాడు. ‘న్యూజిలాండ్‌పై సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేశాడు. అతను శతకం కొట్టినప్పటికీ తిరిగి జట్టులోకి రాలేకపోయాడు. వెస్టిండీస్‌పై సాయి సుదర్శన్ 87 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి టెస్టుకు అతన్ని తుది జట్టులోకి తీసుకోలేదు. జట్టులో చాలా గందరగోళం ఉంది.’అని కైఫ్ చెప్పుకొచ్చాడు.


Next Story