- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రొనాల్డో లేని టీంతో ఢీ.. నేడే ఆల్-నాజర్‌తో ఎఫ్‌సీ గోవా మ్యాచ్
రొనాల్డో లేని ఆల్-నాజర్ టీంను ఢీకొట్టేందుకు ఎఫ్‌సీ గోవా సిద్ధమవుతోంది. ఏఎఫ్‌ఎల్ చాంపియన్స్ లీగ్-2లో జరిగే ఈ మ్యాచ్ గోవాకు చాలా కీలకం.

దిశ, స్పోర్ట్స్: ఫుట్‌బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో భారత్‌కు రాలేదు. అందుకని అతను లేని సౌదీ దిగ్గజ టీం ఆల్-నాజర్‌ను ఎదుర్కోవడం ఎఫ్‌సీ గోవాకు అంత ఈజీ కాదు. బుధవారం నాడు జరిగే ఏఎఫ్‌సీ ఛాంపియన్ లీగ్-2లో జరిగే గ్రూప్-ఎ మ్యాచ్.. గెలవాలంటే గోవా టీం చెమటలు చిందించాల్సిందే. ఈ మ్యాచ్ కోసం తొలిసారి భారత్‌కు రొనాల్డో వస్తాడని అంతా అనుకున్నా.. అతను రావడం లేదని ఆల్-నాజర్ క్లబ్ వెల్లడించింది. అతనితోపాటు క్రొయేషియా స్టార్ మార్సెలో బ్రోజోవిక్ కూడా రాలేదు.
అయినా సరే టోర్నీలో విజయాల ఖాతా తెరవడం గోవా టీంకు కష్టమనే చెప్పాలి. మనోలో మార్కెజ్ కోచింగ్‌లో గోవా టీం అడపా దడపా రాణించినా.. సామర్థ్యానికి తగ్గ ప్రదర్శన ఇప్పటి వరకు చెయ్యలేదనే చెప్పాలి. ఈ టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లో ఆల్-జవారా ఎస్‌సీ చేతిలో 0-2 తేడాతో ఎఫ్‌సీ గోవా ఓటమి చవిచూసింది. రెండో మ్యాచులో ఎఫ్‌సీ ఇంటిక్లోల్‌పై మెరుగైన ప్రదర్శన చేసినా.. అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక 0-2 తేడాతో మరోసారి ఓడింది. ఈ క్రమంలో బలమైన ఆల్-నాజర్‌పై ఈ టీం ఎలా ఆడుతుందో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.






