- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
100 మీటర్లు 10.18 సెకన్లలోనే.. ఇండియా ఫాస్టెస్ట్ మ్యాన్‌గా అనిమేశ్ కుజురు
భారత స్ప్రింటర్ అనిమేశ్ కుజుర్ 100 మీటర్ల రేసులో కొత్త జాతీయ రికార్డును సృష్టించాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత స్ప్రింటర్ అనిమేశ్ కుజుర్ 100 మీటర్ల రేసులో కొత్త జాతీయ రికార్డును సృష్టించాడు. 10.18 సెకన్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేశాడు. గ్రీస్‌లో శనివారం జరిగిన డ్రోమియా ఇంటర్నేషనల్ స్ప్రిట్ అండ్ రిలే మీటింగ్‌లో అతను ఈ ఘనత సాధించాడు.ఇంతకుముందు జాతీయ రికార్డు గురిందర్ సింగ్(10.20 సెకన్లు) పేరిట ఉండేది. తాజాగా గురిందర్ సింగ్ రికార్డును అనిమేశ్ బద్దలుకొట్టాడు. అలాగే, 10.20 సెకన్లలోపు 100 మీటర్లు పూర్తి చేసిన మొట్టమొదటి ఇండియన్‌గా కూడా అనిమేశ్ రికార్డుకెక్కాడు. తన అత్యుత్తమ ప్రదర్శనతో గ్రూపు బిలో అగ్రస్థానంలో నిలిచిన అతను మొత్తంగా మూడో స్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికా అథ్లెట్ బెంజమిన్ రిచర్డ్‌సన్(10.01 సెకన్లు), ఒమన్‌కు చెందిన అలీ అన్వర్ అల్ బలుషి(10.12 సెకన్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఒడిశాకు చెందిన 22 ఏళ్ల అనిమేశ్ 200 మీటర్లలోనూ జాతీయ రికార్డును కలిగి ఉన్నాడు. ఈ ఏడాది ఏసియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 20.32 సెకన్లతో కాంస్య పతకం సాధించడంతోపాటు నేషనల్ రికార్డును నెలకొల్పాడు.






