క్రికెట్ చరిత్రలో సంచలనం.. 26 బంతుల్లో సెంచరీ..

by Gantepaka Srikanth |

క్రికెట్ చరిత్ర(Cricket History)లో సంచలన రికార్డ్ నమోదైంది. యూరోపియన్ క్రికెట్ సిరీస్(European Cricket Series) (T10)-ఇటలీలో అద్భుతం ఆవిష్కృతమైంది.

క్రికెట్ చరిత్రలో సంచలనం.. 26 బంతుల్లో సెంచరీ..
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ చరిత్ర(Cricket History)లో సంచలన రికార్డ్ నమోదైంది. యూరోపియన్ క్రికెట్ సిరీస్(European Cricket Series) (T10)-ఇటలీలో అద్భుతం ఆవిష్కృతమైంది. సివిడేట్ జట్టుతో మ్యాచ్‌లో మిలానో ప్లేయర్ జైన్ నఖ్వీ రెచ్చిపోయారు. కేవలం 26 బంతుల్లోనే సెంచరీ చేసి అందరూ నోరెళ్లబెట్టేలా చేశారు. క్రికెట్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. మొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న జైన్ నఖ్వీ 160 పరుగులు చేశారు. ఇందులో 24 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ 8, 10వ ఓవర్లలో 6 బంతులకు 6 సిక్సర్లు కొట్టారు. నఖ్వీ విధ్వంసంతో ఆ జట్టు ఓవర్లలో 210/2 స్కోర్ చేయగా, ప్రత్యర్థి టీమ్ 106 పరుగులకే ఆలౌటైంది.

Next Story