- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు ఊహించని ఎదురు దెబ్బ
2025 ఐపీఎల్ విజయోత్సవ ర్యాలీ నేపథ్యంలో తొక్కిసలాట జరిగి ఏకంగా 11 మంది ఆర్సీబీ ఫ్యాన్స్ మరణించిన

దిశ, వెబ్ డెస్క్: విరాట్ కోహ్లీ అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అతడు ఆడే దేశవాళీ మ్యాచ్ లు చూడకుండా కొత్త ఆంక్షలు తీసుకువచ్చారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ నెల 24వ తేదీన ఆంధ్ర వర్సెస్ ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. విజయ్ హజారే ట్రోఫీలో ( Vijay Hazare Trophy ) భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీకి విరాట్ కోహ్లీతో పాటు రిషబ్ పంత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కోహ్లీ దేశవాళీ మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో, అతన్ని ప్రత్యక్షంగా చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ చివరి నిమిషంలో విరాట్ కోహ్లీ అభిమానులకు షాక్ ఇచ్చింది కర్ణాటక ప్రభుత్వం. 2025 ఐపీఎల్ విజయోత్సవ ర్యాలీ నేపథ్యంలో తొక్కిసలాట జరిగి ఏకంగా 11 మంది ఆర్సీబీ ఫ్యాన్స్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ప్రేక్షకులను ఈ మ్యాచ్ కు అనుమతించకూడదని తాజాగా సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో విరాట్ కోహ్లీ అభిమానులకు నిరాశ మిగిలింది.






