నీకు ఎన్ని ఛాన్స్ లు ఇచ్చినా దండగే... కరుణ్ నాయర్ పై ట్రోలింగ్ !

by velandi.Saikiran |

టీమిండియా (Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో సీనియర్ ప్లేయర్ కరుణ్

నీకు ఎన్ని ఛాన్స్ లు ఇచ్చినా దండగే... కరుణ్ నాయర్ పై ట్రోలింగ్ !
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా (Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో సీనియర్ ప్లేయర్ కరుణ్ నాయర్ ( Karun Nair) మరోసారి నిరాశపరిచాడు. రాక రాక వచ్చిన అవకాశాలను... సద్వినియోగం చేసుకోవడంలో కరుణ్ నాయర్... విఫలమవుతున్నాడు. మొదటి టెస్ట్ లో విఫలమైన కరుణ్ నాయర్... రెండో టెస్టులో కూడా చెత్త ప్రదర్శన కనబరిచాడు. రెండు టెస్టు రెండు ఇన్నింగ్స్ లో 26 పరుగులకే అవుట్ అయి అందరిని నిరాశపరిచాడు.

దీంతో కరుణ్ నాయర్ పైన దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇంగ్లాండు సిరీస్ లో ఇప్పటి వరకు అతను చేసిన అన్ని పరుగులు కలిపి కూడా 100 పరుగులు దాటలేదు. మొదటి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో.. డకౌట్ అయిన కరుణ్ నాయర్... రెండో ఇన్నింగ్స్ వచ్చేసరికి 20 పరుగులకు అవుట్ అయ్యాడు. అయినప్పటికీ రెండో టెస్టులో అతన్ని ఆడిపించారు.

కొత్త కుర్రాడు సాయి సుదర్శన్ ను పక్కకు పెట్టి మరి.. కరుణ్ నాయర్ కు అవకాశాలు ఇచ్చారు. ఇక రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో... 31 పరుగులు చేసిన కరుణ్ నాయర్.... రెండో ఇన్నింగ్స్ లో 26 పరుగులు చేశాడు. దీంతో అతన్ని ఇక పైన ఆడనివ్వకూడదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. అతని స్థానంలో యంగ్ స్టార్ కు అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Twitter Link

Next Story