- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
INDvsNZ: టీమిండియా గెలుపు కోసం గంగమ్మకు హారతి.. కాశీలో ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు
మరికొన్ని గంటల్లోనే దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ ఫైట్‌ను వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ లవర్స్ ఎదురుచూస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (ICC Champions Trophy 2025 Final) చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్స్ సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ (INDvsNZ) మధ్య ఫైనల్ ఫైట్‌ను వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ లవర్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సారి కప్పు ఎగరేసుకుపోవాలని భారత్‌తో పాటు న్యూజిలాండ్ పట్టుదలతో ఉన్నాయి. అయితే భారత్‌లో క్రికెట్ అభిమానులు టీమిండియా గెలుపు కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాశీ విశ్వేశ్వరుడి మందిరంలో అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా గంగా నదికి హారతులు ఇచ్చి ఫ్యాన్స్ ప్రార్థనలు చేశారు.
చిన్నా పెద్ద తేడా లేకుండా క్రికెటర్ల ఫోటోలు, జాతీయ జెండాలు చేతపట్టుకొని టీమిండియా గెలుపు కోసం పలు ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు అభిమానులు చేశారు. ఇక, దేశవ్యాప్తంగా మ్యాచ్ కోసం టీవీలు, అధిక సంఖ్యలో చూసేందుకు బిగ్ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. భారత్ గెలిస్తే సంబరాలు చేసుకునేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా, దుబాయ్ ఇంటర్‌నేషనల్ స్టేడియం (Dubai International Stadium) వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు పకడ్బందీగా ప్రాక్టీస్ చేశాయి. ఈ క్రమంలోనే భారత జట్టు (Team India) ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండానే బరిలోకి దిగబోతున్నట్లుగా తెలుస్తోంది.






