- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RCBకి బిగ్ షాక్... ఆ ఢిల్లీ డేంజర్ ప్లేయర్ వస్తున్నాడు...!
ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య 46వ మ్యాచ్ జరగనుంది. ఈ

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య 46వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియం లో నిర్వహించనున్నారు. సాయంత్రం ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అదిరిపోయే శుభవార్త అందింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ జట్టులోకి రాబోతున్నాడు. గాయం నుంచి కోలుకున్న అతడు... బెంగళూరు మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడని.. నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఫాఫ్ డుప్లెసిస్... జట్టులో చేరితే కచ్చితంగా ఢిల్లీకి ప్లస్ పాయింట్ అవుతుంది. బెంగళూరు జట్టుకు గతంలో కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. ఇక ఇప్పుడు ఆ జట్టు పైనే ఆడబోతున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్ XII: అభిషేక్ పోరెల్, ఫాఫ్ డు ప్లెసిస్, కరుణ్ నాయర్, KL రాహుల్ (WK), అక్షర్ పటేల్ (c), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాబబుల్ XII: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (c), జితేష్ శర్మ (WK), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్, సుయాష్ శర్మ






