రేపే భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్.. మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు

by Malleboina Mahesh |

ఆసియా కప్ 2025 లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ రేపు రాత్రి దుబై వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ నిర్వాహనపై మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు

రేపే భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్.. మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆసియా కప్ 2025 లో భాగంగా నెల 14న (ఆదివారం) భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ ఉంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ జట్టుతో ఎటువంటి మ్యాచులు ఆడవద్దని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ నిర్వాహణపై అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే రేపు రాత్రి ఈ మ్యాచ్ జరగనుండగా.. ఇందులో పాల్గొనడంపై గాని పాల్గొనకపోవడంపై గాని ఇరు దేశాల నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. దీంతో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం కోట్లాది మంది అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ గురించి బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. "ACC, ICC బహుళజాతి టోర్నమెంట్‌లను నిర్వహించినప్పుడు, దేశాలు పాల్గొనడం తప్పనిసరి అవుతుంది. ఏ దేశమైనా ఇలాంటి టోర్నమెంట్‌లో ఆడకపోతే.. ఆ దేశ జట్టు టోర్నమెంట్ నుండి తొలగించబడుతుంది. దీంతో వారు ప్రతిష్ఠాత్మ సిరీస్‌ను వదులుకోవలసి ఉంటుంది. ఇలా చేస్తే.. ఇతర జట్టు ఆ జట్టు పాయింట్లను పొందుతుందని అనురాగ్ ఠాకూర్ గుర్తుచేశారు. అలాగే భారతదేశం పాకిస్తాన్‌తో ఎప్పటికి ద్వైపాక్షిక టోర్నమెంట్‌లను ఆడదని, పాకిస్తాన్ భారతదేశంపై ఉగ్రవాద దాడులను ఆపివేసే వరకు భారతదేశం పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక టోర్నమెంట్‌లను ఆడకూడదని మేము చాలా సంవత్సరాలుగా నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

Next Story