విజయ్ హజారే ట్రోఫీలో అందరూ ఆడాల్సిందే : బీసీసీఐ

by Muthe.Rajitha |

డిసెంబరు 24 నుంచి ప్రారంభమయ్యే విజయ్‌ హజారే ట్రోఫీలో టీంఇండియా ఆటగాళ్లందరూ తప్పనిసరిగా ఆడాల్సిందేనని బీసీసీఐ ఆదేశించింది.

విజయ్ హజారే ట్రోఫీలో అందరూ ఆడాల్సిందే : బీసీసీఐ
X

దిశ,, వెబ్ డెస్క్ : డిసెంబరు 24 నుంచి ప్రారంభమయ్యే విజయ్‌ హజారే ట్రోఫీలో టీంఇండియా ఆటగాళ్లందరూ తప్పనిసరిగా ఆడాల్సిందేనని బీసీసీఐ ఆదేశించింది. ఈ ట్రోఫీలో ప్రస్తుత భారత జట్టు ఆటగాళ్లందరూ కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలని స్పష్టం చేసింది. కాగా ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికాతో సిరీస్ డిసెంబర్ 19న ముగుస్తుండగా.. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మధ్యలో ఉన్న మూడు వారాల విరామంలో సీనియర్ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాలని బోర్డు స్పష్టం చేసింది. దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యం పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఇక విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉంటామని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటికే తమ రాష్ట్ర జట్లకు సమాచారం ఇచ్చారు. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ప్రారంభమయ్యేలోగా ఒక్కో జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడేలా షెడ్యూల్ ఉండగా, అందులో ఏ రెండు మ్యాచ్‌లు ఆడాలనేది ఆటగాళ్లు, రాష్ట్ర సంఘాలు నిర్ణయించుకోవచ్చని పేర్కొంది. ఫిట్‌నెస్ సమస్యలు ఉన్న ఆటగాళ్లకు మినహాయింపు ఉంటుందని తెలిపింది.

Next Story