అదరగొట్టిన హైదరాబాద్ షూటర్ ఇషా.. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం కైవసం

by Harish |

భారత షూటర్, తెలంగాణకు చెందిన ఇషా సింగ్ గురి అదిరింది.

అదరగొట్టిన హైదరాబాద్ షూటర్ ఇషా.. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : భారత షూటర్, తెలంగాణకు చెందిన ఇషా సింగ్ గురి అదిరింది. వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తొలిసారిగా వ్యక్తిగత విభాగంలో పతకాన్ని గెలిచింది. ఈజిప్ట్‌లో జరుగుతున్న టోర్నీలో ఇషా మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించింది. ఫైనల్‌లో 30 పాయింట్స్‌‌తో మూడో స్థానం నిలిచింది. కొరియాకు చెందిన జియిన్ యాంగ్(40) గోల్డ్ మెడల్, చైనా షూటర్ క్వియాన్‌జున్ యావో(38) సిల్వర్ మెడల్ సాధించారు. మరోవైపు పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మను బాకర్ పతకం గెలవలేకపోయింది. 23 స్కోరుతో 5వ స్థానంతో సరిపెట్టింది.

ఇషాకు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత విభాగంలో ఇదే తొలి మెడల్ అయినప్పటికీ టీమ్ ఈవెంట్‌లో మాత్రం ఇప్పటికే ఆమె ఖాతాలో రెండు బంగారు పతకాలు ఉన్నాయి. 2023 ఎడిషన్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్, మహిళల టీమ్ ఈవెంట్ల‌లో ఆమె గోల్డ్ మెడల్ సాధించింది. అలాగే, ఈ ఎడిషన్‌లో ఇషాకు ఇది మూడో మెడల్. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌ మిక్స్‌డ్, టీమ్ ఈవెంట్లలో రజత పతకం సాధించింది. మొత్తంగా టోర్నీలో భారత్ పతకాల సంఖ్య 12‌కు చేరింది.


Next Story