PSL: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. పీఎస్‌ఎల్ నుంచి వెళ్లిపోతామంటున్న ఇంగ్లండ్ ప్లేయర్లు!

by Phanindra |

ఆపరేషన్ సిందూర్ తర్వాత పీఎస్ఎల్ ఆడుతున్న ఇంగ్లండ్ ప్లేయర్లలో ఆందోళన పెరిగింది. వాళ్లు పీఎస్ఎల్ వదిలేసి స్వదేశం వెళ్లిపోవాలని అనుకుంటున్నారట.

PSL: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. పీఎస్‌ఎల్ నుంచి వెళ్లిపోతామంటున్న ఇంగ్లండ్ ప్లేయర్లు!
X

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్‌ సూపర్ లీగ్‌పై (PSL) ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ పడింది. ఈ ఆపరేసన్ తర్వాత అసలు పీఎస్ఎల్ మ్యాచులు జరుగుతాయా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా లీగ్‌ను కొనసాగిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసింది. ఇలాంటి సమయంలో లీగ్ ఆడుతున్న కొందరు ఇంగ్లండ్ ఆటగాళ్లు పాకిస్తాన్ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నారట.

పీఎస్‌ఎల్‌లో ఏడుగురు ఇంగ్లిష్ ప్లేయర్లు ఆడుతున్నారు. వారు శామ్ బిల్లింగ్స్, జేమ్స్ విన్స్, టామ్ కర్రాన్ డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్, టామ్ కోలర్ కాన్మో్ర్, లూక్ వుడ్. వీళ్లలో విల్లీ, జోర్డాన్ ఇద్దరూ కూడా ముల్తాన్ సుల్తాన్స్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఆ టీం ప్లేఆఫ్స్ రేసు నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఆ టీం మరో లీగ్ మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో తాము ఇంగ్లండ్ వెళ్లిపోతామని జోర్డాన్, విల్లీ ఇద్దరూ కూడా ముల్తాన్ టీం (Multan Sultans) యాజమాన్యానికి చెప్పేశారట. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా భారత్, పాక్ మధ్య యుద్ధవాతావరణాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోందని సమాచారం. యూకే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే, తమ ప్లేయర్లందర్నీ పాక్ నుంచి వెనక్కి వచ్చేయాలని ఈసీబీ ఆదేశించినా ఆశ్చర్యం లేదు.

Next Story